Government Jobs: గుడ్ న్యూస్.. 50000 ప్రభుత్వ ఉద్యోగాలు

మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం

Update: 2024-09-14 06:54 GMT

పలు రంగాలలో 50,000 ఖాళీలు భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. త్వరలోనే భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. రైల్వే NTPC, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) కానిస్టేబుల్స్ విభాగాల్లో ఉద్యోగాలకు త్వరలోనే పరీక్షలు నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్‌ నెల పూర్తయ్యే సమయానికి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి ఈ సమయం చాలా కీలకమని చెప్పొచ్చు.


RRB రిక్రూట్‌మెంట్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 11,558 నాన్-టెక్నికల్ పోస్టుల కోసం భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టుల కోసం దరఖాస్తులు సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 13 వరకుచేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తులు సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు rrcb.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.

ITBP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్
ITBP కిచెన్ సర్వీస్‌లో 819 కానిస్టేబుల్ ఖాళీలను ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 1 లోపు అధికారిక ITBP వెబ్‌సైట్, itbpolice.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్రాత పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎవాల్యుయేషన్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు.

SSC కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 39,481 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) స్థానాలకు రిక్రూట్మెంట్ చేయనున్నారు. ఈ ఖాళీలు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), అస్సాంలోని SSF, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో రైఫిల్‌మ్యాన్ అవకాశం కనిపిస్తుంది. SSC వెబ్‌సైట్, ssc.nic.inలో అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో కానిస్టేబుల్, ఫైర్‌మెన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ప్రారంభించింది. 1,130 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు CISF వెబ్‌సైట్, cisfrectt.cisf.gov.in ద్వారా సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ నేవీ సీనియర్ సెకండరీ రిక్రూట్‌మెంట్ మెడికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రారంభమైంది. సైన్స్ నేపథ్యం ఉన్న అవివాహిత అభ్యర్థులకు అవకాశం ఉంది. joinindiannavy.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 17 చివరి తేదీ.


Tags:    

Similar News