Jobs: గుడ్ న్యూస్: నాబార్డ్ గ్రేడ్ A రిక్రూట్‌మెంట్ విడుదల.. లక్ష వరకూ జీతం
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) గ్రేడ్ A ఆఫీసర్స్ (అసిస్టెంట్ మేనేజర్) రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ భారతదేశంలోని వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటునందించడంపై దృష్టి పెట్టనుంది. అధికారిక పోర్టల్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అందుబాటులో ఉన్న 150 ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ 27 జూలై నుండి 15 ఆగస్టు 2024 వరకు సాగుతుంది. అర్హత ప్రమాణాలు, ఇతర ముఖ్యమైన సమాచారం కోసం NABARD గ్రూప్ A రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
నాబార్డ్ గ్రేడ్ A ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. వివరణాత్మక నోటిఫికేషన్‌లో పేర్కొన్న పర్సెంటేజీతో డిగ్రీని పూర్తి చేయాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ చేసిన వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.
నాబార్డ్ గ్రేడ్ A రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు అభ్యర్థులు ఫీజు వివరాలు:
జనరల్/OBC/EWS: ₹800/-
SC/ST/PWD: ₹150/-
ప్రారంభ వేతనం నెలకు రూ.44,500 (బేసిక్ పే)గా ఉంటుంది. DA, HRA, ఇతర అలవెన్సులతో రూ. లక్ష వరకు వస్తుంది. సంబంధిత వెబ్ సైట్: www.nabard.org/