44,288 ఉద్యోగాలు.. మార్పులు చేసుకోడానికి సమయం ఇదే
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (ఇండియా పోస్ట్) గ్రామీణ డాక్ సేవక్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (ఇండియా పోస్ట్) గ్రామీణ డాక్ సేవక్ (GDS) 2024 రిక్రూట్‌మెంట్ కోసం ఆగస్టు 5, 2024న రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. అభ్యర్థులు అధికారిక ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులలో ఏమైనా దిద్దుబాటులు ఉన్నా.. మార్పులు చేసుకోవాలనుకుంటే ఆగస్టు 6 నుండి 8 వరకు అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం.. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా 23 పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 44,228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. రాజస్థాన్ (2,718), బీహార్ (2,558), ఉత్తరప్రదేశ్ (4,588), ఛత్తీస్‌గఢ్ (1,338), మధ్యప్రదేశ్ (4,011)లలో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల 10వ తరగతి పరీక్ష ఫలితాల మెరిట్ జాబితా ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారత ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులచే గుర్తింపు పొందిన ఏదైనా బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి అవసరమైన లేదా ఐచ్ఛిక సబ్జెక్టులలో గణితం, ఆంగ్లంతో సెకండరీ స్కూల్ (10వ తరగతి) పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం, సైక్లింగ్ నైపుణ్యాలు కూడా అవసరం. వయోపరిమితి: ఆగస్టు 5, 2024 నాటికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18- 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు సడలింపు ఉంది.