Jobs: భారత ప్రభుత్వంలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు.. ఈ వివరాలు మీకోసమే!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్;

Update: 2024-10-07 02:26 GMT
Jobs, UPSC, EngineeringRecruitment, ESE2025, UPSC ESE 2025 Notification Released today, UPSC Engineering Recruitment is scheduled 2025, government job notifications 2025 latest today telugu,  upsc 2025 job notifications latest, latest jobs in india

UPSC ESE 2025 Notification

  • whatsapp icon

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భారత ప్రభుత్వం విభాగాల్లో ఇంజనీర్లకు అవకాశం ఇవ్వడానికి, వివిధ ఉద్యోగాలు చేయడానికి ప్రతి సంవత్సరం పరీక్షను నిర్వహిస్తారు.

UPSC ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 నాలుగు ఇంజనీరింగ్ విభాగాల్లో 232 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. upsc.gov.in అధికారిక సైట్ ద్వారా అర్హతగల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 18 సెప్టెంబర్ నుండి 08 అక్టోబర్ 2024 వరకు షెడ్యూల్ చేశారు. ఈ ఖాళీల కోసం ప్రిలిమినరీ పరీక్ష 09 ఫిబ్రవరి 2025న నిర్వహించనున్నారు.

UPSC ఇంజినీరింగ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) ఇన్‌స్టిట్యూషన్ ఎగ్జామినేషన్‌లో సెక్షన్లు A, Bలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన విదేశీ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్‌లో డిగ్రీ/డిప్లొమా ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ (ఇండియా) గ్రాడ్యుయేట్ మెంబర్‌షిప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్ II, III/సెక్షన్లు A, Bలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి అయితే.. అభ్యర్థులు తప్పనిసరిగా 2025 జనవరి 1 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పరీక్షకు అర్హత పొందాలంటే 2 జనవరి 1995 కంటే ముందు 1 జనవరి 2004లోపు జన్మించి ఉండకూడదు. రిజర్వ్‌డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. upsc.gov.in వెబ్ సైట్ ను మరిన్ని వివరాలకు సంప్రదించండి. జనరల్/OBC అభ్యర్థులు 200 రూపాయలు ఫీజు చెల్లించాలి. స్త్రీ/SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.
Tags:    

Similar News