Railway Jobs: స్టేషన్ మాస్టర్ ఉద్యోగం చేయాలని ఉందా.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులో భారీగా ఉద్యోగాలు!

టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్;

Update: 2024-09-14 13:46 GMT
RailwayJobs, JobsInRailways, RailwayJob, graduateposts, RRB NTPC 2024 registration begins for graduate posts,  RRB NTPC 2024 notifications, RRB NTPC 2024  graduate posts notification, latest  central government job notifications

RRB NTPC 2024 notifications

  • whatsapp icon

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) కింద గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి. అభ్యర్థులు rrbapply.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోడానికి ఆఖరి తేదీని అక్టోబర్ 13గా నిర్ణయించారు.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ లో NTPC చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 8113 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసి ఉంటే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 - 36 సంవత్సరాలు ఉండాలి.

RRB NTPC క్రింద ఖాళీలు ఇవే:
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్: 1,736 ఖాళీలు
స్టేషన్ మాస్టర్: 994 ఖాళీలు
గూడ్స్ రైలు మేనేజర్: 3,144 ఖాళీలు
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 1,507 ఖాళీలు
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 732 ఖాళీలు
మొత్తం: 8,113

అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం RRB NTPC ఖాళీలు ఇవి:
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 ఖాళీలు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 ఖాళీలు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 ఖాళీలు
ట్రైన్స్ క్లర్క్: 72 ఖాళీలు
మొత్తం: 3,445


Tags:    

Similar News