రామ్ టచ్ చేసాడుగా

Update: 2018-11-18 03:45 GMT
రామ్ టచ్ చేసాడుగా
  • whatsapp icon

అన్నంతగా అందరిని మెప్పించలేకపోయినా... సపోర్ట్ చేసి "హలో గురు ప్రేమ కోసమే" సినిమా ని హిట్ చేసిన ప్రతి ఒక్కరికి 🙏.. ముఖ్యంగా నా ఫ్యాన్స్ కి❤️..ఈసారి వడ్డీ తో పాటు తిరిగిచ్చేస్తా ... ఇది రామ్ పోతినేని తన సినిమా "హలో గురు ప్రేమ కోసమే" సినిమా హిట్ గురించి, తన ఫాన్స్ తనకిచ్చిన సపోర్ట్ గురించి ప్రేమతో చేసిన ట్వీట్. నేను శైలజ తర్వాత మళ్ళీ ఓ అన్నంత హిట్ అందుకోలేపోతున్న రామ్ తన అభిమానులను ఈసారి నిరాశ పరచనంటున్నాడు. ఉన్నది ఒకటే జిందగీ తో యావరేజ్ హిట్ కొట్టిన రామ్, త్రినాధరావు నక్కినితో హలో గురు ప్రేమ కోసమేతో అయినా సూపర్ హిట్ కొట్టాలనుకున్నాడు.

అనుపమ పరమేశ్వరన్ - రామ్ జంటగా త్రినాథ రావు నక్కినతో కలిసి దిల్ రాజు నిర్మాణంలో చేసిన హలో గురు ప్రేమ కోసం ఈచిత్రం విడుదలై యావరేజ్ టాక్ తో నడిచినా క్లోజింగ్ కలెక్షన్స్ చూసేసరికి హిట్ అయ్యింది. మరి సూపర్ హిట్ కొట్టాలన్న రామ్ మళ్ళీ హలో గురు ప్రేమ కోసమే తో హిట్ కొట్టాడు. ముందు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఫైనల్ కలక్షన్స్ మాత్రం హిట్ ని చూపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ హిట్ కలెక్షన్స్ చూసే రామ్ అలా తన ఫాన్స్ కి ఉద్దేశించి ట్వీట్ చేసాడు. మరి రామ్ చేసిన ఆ ట్వీట్ ని చూస్తుంటే మాత్రం హార్ట్ టచ్చింగ్ గా కనబడ్డం లేదు?. మరి ఈసారి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానంటున్నాడు.. అంటే ఈసారి రామ్ పక్కాగా సూపర్ హిట్ కొట్టడం ఖాయమే. అన్నట్టు రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఎనౌన్స్ చెయ్యలేదు.

Similar News