హీరో విశాల్ ఆరోగ్యంపై అప్ డేట్ ఇదే
హీరో విశాల్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు ఆయన అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి;
హీరో విశాల్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు ఆయన అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. మదగజరాజ ఈవెంట్లో విశాల్ ను చూసిన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయనకు ఏ వ్యాధి సంక్రమించింది? ఎందుకలా ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే అపోలో ఆసుపత్రి వైద్యులు మాత్రం విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు.
వైరల్ ఫీవర్...
హీరో విశాల్ ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు తాజా అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నారని పేర్కొన్నారు. ఆయనకు చికిత్స అందిస్తున్నామని, విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అపోలో వైద్యులు లేఖ విడుదల చేశారు. ‘మదగజరాజ' ఈవెంట్లో విశాల్ వణుకుతూ, సరిగ్గా నడవలేకుండా కనిపించారు. పూర్తిగా సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ