Ananthapuram : నేడు అనంతపురంలో డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు

అనంతపురంలో నేడు జరగాల్సిన డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినట్లు నిర్వాహకులు ప్రకటించారు.;

Update: 2025-01-09 03:48 GMT

అనంతపురంలో నేడు జరగాల్సిన డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించడంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రద్దు చేసినట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈరోజు డాకూ మహారాజ్ ఈవెంట్ కు హీరో నందమూరి బాలకృష్ణతో పాటు సీనీ యూనిట్ అక్కడకు రానున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతి ఘటనతో...
తిరుపతిలో ఘటన తో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశామని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్మాతలు తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులు ఆవేదకు గురవుతున్నారని, అయితే తిరుపతి ఘటన దృష్ట్యా మాత్రమే ఈవెంట్ ను రద్దు చేయాల్సి వచ్చిందని నిర్మాతులు తెలిపారు.


Tags:    

Similar News