Pawan Kalyan : పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్... వీరమల్లు వచ్చేస్తున్నాడోచ్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఇప్పుడు గుడ్ న్యూస్ అందింది. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లుపై తాజా అప్ డేట్ వచ్చేసింది.;

పవర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా నిరాశతో ఉన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించరేమోనన్న బెంగ ఆయన ఫ్యాన్స్ లో అనేక మందికి ఉంది. అయితే ఆయన రాజకీయాల్లో రాణించడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలను నిర్వరిస్తుండటంతో ఇక మూవీలు చేయడం కష్టమేనని అందరూ అనుకుంటున్న సమయంలో అప్పటికే అంగీకరించిన సినిమాలు పూర్తి చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం అభిమానుల చెవులకు ఇంపుగా వినిపించింది. ఆయన మూవీ ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆలస్యమవుతుందని...
అలాంటి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఇప్పుడు గుడ్ న్యూస్ అందింది. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లుపై తాజా అప్ డేట్ వచ్చేసింది. హరిహర వీరమల్లు అనుకున్న సమయానికే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం షూటింగ్ ను రాజకీయాల్లో బిజీగానే ఉంటూ పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. అయితే ఇంకా డబ్బింగ్ వంటివి పూర్తి కావాల్సి ఉంది. అయితే పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కు ప్రమాదానికి గురి కావడంతో మూవీ విడుదల ఆలస్యమవుతుందని అందరూ అనుకున్నారు.
మే 9న థియేటర్లలోకి...
కానీ మే 9వ తేదీన హరిహర వీరమల్లు చిత్రం విడుదల అవుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడితో పాటు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో పవన్ కల్యాణ్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీరికార్డింగ్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. చారిత్రక కథ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం విడుదల కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాల భాషల్లో ఒకే సారి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.