పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

ప్రస్తుతం దేశంలో బంగారం ధర తగ్గింది. పది గ్రాముల బంగారం పై రూ.220 లు తగ్గింది

Update: 2022-02-17 01:17 GMT

బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదల మామూలే. ఎప్పుుడు ధరలు తగ్గుతాయో? ఎప్పుడు పెరుగుతాయన్నది అంతర్జాతీయ మార్కెట్ ను అనుసరించి ఉంటుంది. డిమాండ్, సప్లయ్ అనేది బంగారం ధరలపై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతుంటారు. బంగారం కొనుగోళ్లకు ప్రత్యేకంగా ఒక సమయం ఇప్పుడు ఏదీ లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. బంగారాన్ని పెట్టుబడిగా చూసే మన భారత్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

ఎంత తగ్గిందంటే?
ప్రస్తుతం దేశంలో బంగారం ధర తగ్గింది. పది గ్రాముల బంగారం పై రూ.220 లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 46,200 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News