Maharasthra : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభకు సంబంధించి పోలింగ్ కొద్దిసేపటిక్రితం ప్రారంభమయింది.

Update: 2024-11-20 01:55 GMT

దేశంలోని అత్యంత ప్రముఖ రాష్ట్రమైన మహారాష్ట్ర శాసనసభకు పోలింగ్ కొద్దిసేపటిక్రితం ప్రారంభమయింది. అలాగే జార్ఖండ్ రాష్ట్రంలో కూడా పోలింగ్ జరుగుుతంది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ మహాయతి కూటమి, కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ ల కూటమి మహా వికాస్ అఘాడీల మధ్య పోటీ జరుగుతుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జార్ఖం ్ లో రెండో విడతగా 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. దీంతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉప ఎన్నికలు కూడా నేడు జరగనున్నాయి.

భారీ బందోబస్తు మధ్య....
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జార్ఖండ్ లో 38 అసెంబ్లీ స్థానాలకు 528 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లో పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఓటర్లు బారులు తీరారు. అనేక మంది ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది.


Tags:    

Similar News