Delhi Polution : ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానాలు రద్దు

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకూ పెరుగుతుంది. వాయుకాలుష్యంతో పాటు పొగమంచు కూడా పెరుగుతుంది

Update: 2024-11-18 05:03 GMT

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకూ పెరుగుతుంది. వాయుకాలుష్యంతో పాటు పొగమంచు కూడా పెరుగుతుంది. ఢిల్లీ నగరాన్ని పొగమంచు కమ్మేసింది. వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దగ్గరలోని వాహనాలను కూడా గుర్తించలేకపోతుంది. దీంతో వాహనదారులు వాహనాలను నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

పొగమంచు కారణంగా...
పొగమంచు విపరీతంగా పెరగడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు విమానాలను పొగమంచు కారణంగా రద్దు చేశారు. మరో 100 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాయు నాణ్యత 428కి చేరడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. బయటకు వస్తే మాస్క్ లు కంపల్సరీగా ధరిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో అనేక ఆంక్షలు విధించారు.


Tags:    

Similar News