కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు వ్యక్తి
తొలిసారి భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు.
తొలిసారి భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందని కొండ్రు సంజయ్ మూర్తి కాగ్ ఆడిటర్ జనరల్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియామక ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. పదిహేనవ కాగ్ అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు.
అమలాపురానికి చెందిన...
ఇప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న గిరీశ్ చంద్ర పదవీ కాలం ముగియడంతో రాష్ట్రపతి ఈ నియామకం చేపట్టారు. అమలాపురానికి చెందిన కొండ్రు సంజయ్ మూర్తి 1964లో జన్మించారు. మెకానిక్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన మూర్తి తర్వాత ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. వచ్చే నెలలో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఈ కీలక బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.