Sabarimala : అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ
శబరిమలకు వెళ్లే అయ్యప్పలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అయ్యప్పల కోసం 26 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.
శబరిమలకు వెళ్లే అయ్యప్పలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే అయ్యప్పల కోసం 26 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. మండల పూజలు ప్రారంభం కావడంతో శబరిమలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఇరవై ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
సురక్షిత ప్రయాణం...
ఈ రైళ్లలో సులువుగా శబరిమల క్షేత్రానికి చేరుకునే వీలుంది. ఈ నెల నుంచే ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరి వెళ్లనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శబరిమలకు వెళ్లే భక్తులు రోడ్డు మార్గాన వెళ్లి అనేక ప్రమాదాల బారిన పడుతున్నారు. సురక్షితంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరిగి తన స్వస్థలానికి చేరుకునేందుకు ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.