పారాహుషార్ ..బంగారం మరింత ప్రియం

రెండు నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Update: 2022-03-06 06:11 GMT

రెండు నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల కారణంగా బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయని వారు విశ్లేషించారు. పది గ్రాముల బంగారం ధర 56,000 దాటే అవకాశముందని వారు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఉక్రెయిన్ యుద్ధమేనని అంటున్నారు.

వెండి అమాంతం....
వెండి కూడా రెండు నెలల్లో మరింత ప్రియం కానుంది. ప్రస్తుతం కిలో వెండి 72,000 వరకూ ఉంది. దీని ధర 80 నుంచి 85 వేలకు చేరుకునే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యుద్ధం ఇంకా కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరగవచ్చని చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 2100 డాలర్లకు చేరే అవకాశముంది.


Tags:    

Similar News