Delhi Liqour Scam : కవిత, కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ గడువు కోర్టు పొడిగించింది.

Update: 2024-08-13 13:47 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ గడువు కోర్టు పొడిగించింది. వచ్చే నెల రెండో తేదీ వరకూ ఇద్దరికీ జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటు కవిత, అటు కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్లు సుప్రీంకోర్టులో విచారణకు సిద్ధంగా ఉన్నాయి.

సెప్టంబరు రెండో తేదీ వరకూ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత సీబీఐ కూడా ఇదే స్కామ్ లో కేసు నమోదు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేశాయి. ఇద్దరు తీహార్ జైలులో ఉన్నారు. ఇద్దరూ తమకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా జ్యుడిషియల్ రిమాండ్ గడువు పెంచుతూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది.


Tags:    

Similar News