ధరలు స్వల్పంగానే పెరిగాయ్

దేశీయంగా బంగారం ధర తులం పై పది రూపాయలు మాత్రమే పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-01-17 02:10 GMT

అనుకున్నట్లుగానే బంగారం ధరలు రోజూ స్వల్పంగా పెరగడం ప్రారంభించాయి. ఇక ఈ ధరల్లో వేగం అందుకోలేదు. స్వల్పంగా మాత్రమే పెరుగుతుండటం వినియోగదారులకు కొంత ఊరట అని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల ప్రభావం బంగారం ధరలపై చూపుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కూడా బంగారం ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే కొనుగోలుదారులు ఇలాంటి సమయంలోనే బంగారం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

స్వల్పంగా పెరిగిన....
దేశీయంగా బంగారం ధర తులం పై పది రూపాయలు మాత్రమే పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,900 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,090 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 65,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News