Deputy speaker: మూడో అంతస్తు నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్
మూడో అంతస్తు నుండి దూకేశారు
మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ మూడో అంతస్తు నుండి దూకేశారు. ఆయనతో పాటూ పలువురు ఇతర గిరిజన ఎమ్మెల్యేలు కూడా శుక్రవారం నాడు సచివాలయం మూడవ అంతస్తు నుండి దూకారు. అయితే వారంతా సేఫ్టీ నెట్ మీద పడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ధన్‌గర్ కమ్యూనిటీకి ఎస్టీ కేటగిరీ కింద రిజర్వేషన్లు కల్పించడాన్ని నిరసిస్తూ ఈ పని చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో గిరిజన నాయకులను పోలీసులు, భద్రతా అధికారులు రక్షించారు.
గిరిజన ఎమ్మెల్యేలు పెసా (పంచాయతీల నిబంధనలు) కింద నోటిఫై చేయబడిన షెడ్యూల్డ్ తెగ అభ్యర్థుల నియామకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ మూడో అంతస్తు నుండి దూకారు. ధన్గర్ కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో గిరిజన ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. థర్డ్ ఫ్లోర్ నుంచి కొన్ని డాక్యుమెంట్లను గాల్లోకి విసిరేస్తూ దూకేశారు. కింద నెట్ కట్టి ఉండటంతో ఎవరికీ ఏం కాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధన్గర్ లకు షెడ్యూల్డ్ తెగ హోదాను మంజూరు చేయడాన్ని ఈ నాయకులు తప్పుబడుతూ ఉన్నారు.