Leopard : చిరుత పులులు తగ్గుతున్నాయట... ఆందోళనేగా?
దేశంలో చిరుత పులుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో చిరుత పులుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ సమస్యలతో అవి ఇబ్బంది పడుతూ అడవుల్లో ఉండలేక మైదాన ప్రాంతాల్లోకి రావడం, వాటిని బంధించడం కొన్ని చోట్ల జరుగుతుందని, మరొక వైపు వాటి సంఖ్య క్రమంగా అంతరించిపోతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది.
గణన చేపట్టడంతో...
ఇటీవల ఒరిస్సా రాష్ట్రంలో ప్రస్తుతం 696 చిరుతలున్నాయని అటవీశాఖ అధికార వర్గాలు ప్రకటించాయి. కేంద్రం ఆధ్వర్యంలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2022లో చిరుత పులుల గణన చేపట్టింది. ఒరిస్సా లో 568 చిరుత పులులు ఉన్నట్లు ప్రకటించింది. అంతకుముందు 2018లో రాష్ట్ర అటవీశాఖ గణనలో 760 చిరుత పులులున్నట్లు నిర్ధారణ అయింది. ఇటీవల మళ్లీ లెక్కింపు జరగ్గా ఈ సంఖ్య 696కు తగ్గిపోయిందని తేలడంతో వీటి సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.