Supreme Court : ఎస్సీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టు కొట్టివేత
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణకు అనర్హమైనవిగా పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాదాపు పది పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
అన్ని పిటీషన్లను కొట్టివేత...
పిటీషన్లను అన్నీ పరిశీలించిన తర్వాత సమీక్షించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంతో కొట్టివేస్తున్నామని తెలిపింది. దీంతో ఎస్సీ వర్గీకరణకు మార్గం మరింత సుగమమయింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు మాదిగలకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తుండగా, మరికొన్ని అవే ప్రయత్నంలో ఉన్నాయి. మాల మహానాడుకు చెందిన కొందరు ఈ పిటీషన్లను దాఖలు చేశారు.