17 నెలల తర్వాత ఇంట్లో టీ తాగుతున్నా : మనీష్ సిసోడియా

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. పదిహేడు నెలలు ఆయన తీహార్ జైలులో ఉన్నారు.;

Update: 2024-08-10 06:40 GMT
manish sisodia bail, former delhi deputy CM
  • whatsapp icon

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. పదిహేడు నెలలు ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన మనీష్ సిసోడియా గత ఏడాది ఫిబ్రవిరి 26వ తేదీన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు. ఆయన అనేక సార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది.

బెయిల్ పై విడుదలయి...
చివరకు నిన్న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో మనీష్ సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన ఈరోజు ఉదయం ఇంట్లో టీ తాగుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పదిహేడు నెలల తర్వాత తాను ఇంటి టీ తాగుతున్నానంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈరోజు మనీష్ సిసోడియా కుటుంబ సభ్యులతో కలసి ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.


Tags:    

Similar News