భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలో ఈరోజు బంగారం, ధరలు వెండి పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.400లు, కిలో వెండిపై రూ.1,300 లు పెరిగింది

Update: 2022-03-10 01:23 GMT

బంగారాన్ని పెట్టుబడిగా చూడటం వల్లనే భారత్ లో దానికి అంత డిమాండ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల ప్రభావం బంగారం ధరపై ఉంటుంది. ప్రధానంగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా బంగారం ధర పెరగడానికి కారణమని చెప్పకతప్పదు. యుద్ధం ఇలాగా కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం కొనుగోళ్లకు ఇదే మంచి సమయమని సూచిస్తున్నారు.

వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం, ధరలు వెండి పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.400లు, కిలో వెండిపై రూ.1,300 లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,800 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంారం ధర 54,330 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 76,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News