గుడ్ న్యూస్ .. స్థిరంగా బంగారం ధరలు

దేశ వ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కొనుగోళ్లకు ఇది మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు

Update: 2022-02-06 01:22 GMT

బంగారం ధరలు పెరిగితే పెద్దగా ఆశ్చర్యం ఉండదు. తగ్గితేనే అబ్బురపడతారు. అలాగే బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నా కూడా ఆనందమే. ఎందుకంటే ధరలు పెరగనందుకు ముఖ్యంగా మహిళలు అమితానందపడతారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ నెలలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నెల 20 వ తేదీ వరకూ మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం దుకాణాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. ఈ నెలాఖరుకు మళ్లీ మూఢం రానుంది. అందుకే ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు.

వెండి ధరకూడా.....
దేశ వ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కొనుగోళ్లకు ఇది మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,200 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలో కూడా మార్పులు లేవు. ప్రస్తుతం కిలో వెండి ధర 65,100 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News