పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇది ముఖ్యంగా మహిళలకు ఊరట కల్గించే విషయం

Update: 2022-02-26 01:30 GMT

హైదరాబాద్ : బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో? చెప్పలేం. ఉక్రెయిన్ - రష్యాల యుద్ధంతో నిన్న బంగారం ధరలు పెరిగినా నేడు స్వల్పంగా తగ్గాయి. బంగారం అంటే భారతీయులకు మక్కువ. బంగారాన్ని పెట్టుబడిగా చూసేంత వరకూ దీని డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాయతీయ మార్కెట్ లో ఒడిదుడుకులతో పాటు, యుద్ధం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

ధరలు ఇలా....
కానీ ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇది ముఖ్యంగా మహిళలకు ఊరట కల్గించే విషయం. బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. . 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,850 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 51,110 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర 70,000లుగా ఉంది.


Tags:    

Similar News