మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం పది గ్రాములకు రూ. 400లు, వెండి కిలోకు రూ.1300లు పెరిగింది

Update: 2022-03-11 01:40 GMT

బంగారం ధరలను పెరుగదలను ఆపలేని పరిస్థితి. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం ప్రభావం బంగారం, వెండి ధరలపై స్పష్టంగా పడుతుంది. దీంతో రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసే వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారం ఒక్కటే. ధర ఎంతైనా తమ వద్ద ఉన్న డబ్బులను బట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్. అయితే ప్రస్తుతం యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులన అనుసరించి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

భారీగా పెరిగి...
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం పది గ్రాములకు రూ. 400లు, వెండి కిలోకు రూ.1300లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 49,800 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,330 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 76,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News