పసిడి ప్రియులకు షాక్... పెరిగిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం వెండి ధరలు పెరిగాయి. బంగారం పది గ్రాములపై రూ.720లు, వెండిపై వెయ్యి రూపాయలకు పైగానే పెరిగింది.

Update: 2022-03-01 01:15 GMT

హైదరాబాద్ : ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి అన్నట్లుగా బంగారం ధరలు తగ్గిన వెంటనే కొనుగోలు చేయాలని అంటారు. బంగారానికి ఎప్పుడూ అంత డిమాండ్ ఉంటుంది. వరసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ ఉంటే ఇంకా తగ్గుతాయని వెయిట్ చేయడం వేస్ట్ అవుతుంది. ధరలు తగ్గినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయాలి. బంగారానికి భారత్ లో అంత డిమాండ్ ఉంటుంది. దీనికి కారణం మగువలు ఎక్కువగా ఇష్టపడటమే. అందుకే బంగారం రేటు చూడకుండా డబ్బులున్నప్పుడు కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు కూడా చెబుతుంటారు. పెట్టుబడిగానే బంగారాన్ని చూడాలంటారు.

వెండి కూడా....
ఈరోజు దేశంలో బంగారం వెండి ధరలు పెరిగాయి. బంగారం పది గ్రాములపై రూ.720లు, వెండిపై వెయ్యి రూపాయలకు పైగానే పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,000 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 51,280 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 69,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News