రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. కొనుగోళ్లకు ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు

Update: 2022-02-27 01:31 GMT

హైదరాబాద్ : బంగారం ధరలు నిలకడగా ఉండవు. ఇది అందరికీ తెలిసిందే. పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. అయితే గత రెండు రోజులుగా బంగారం ధరలు కొంత తగ్గుతుండటం ఊరట నిచ్చే విషయమే. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం కూడా బంగారం పై పడలేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల మేరకు బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు.

వెండి ధరలు కూడా...
దేశంలో బంగారం, వెండి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. కొనుగోళ్లకు ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,350 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 50,570 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి దాదాపు వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.69,000 లకు చేరుకుంది.


Tags:    

Similar News