బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాములబంారంపై రూ.1400, కిలో వెండిపై రెండు వేల రూపాయలు పెరిగింది

Update: 2022-02-25 01:03 GMT

అంతర్జాతీయంగా ఏ పరిణామం జరిగినా అది బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. బంగారం ధరలను ఎప్పుడూ అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల ఆధారంగానే నిర్ణయిస్తారు. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధం బంగారం ధరలను పెంచేలా చేసింది. ఇటు క్రూడ్ ఆయిల్ ధరలను మాత్రమే కాకుండా ఈ యుద్ధం బంగారం, వెండిపై కూడా ఎఫెక్ట్ చూపింది. ఎంత ధరలు పెరిగినా భారతీయ మహిళలు మాత్రం బంగారం కొనుగోలు చేయడాన్ని ఆపరు. అందుకే ధరలతో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు భారత్ లో కొనసాగుతుంటాయి.

55 వేలకు....
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాములబంారంపై రూ.1400, కిలో వెండిపై రెండు వేల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,250 రూపాయలుగా ఉంది. 24క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 51,500 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 72,700 రూపాయలుగా ఉంది. బంగారం 55 వేలు చేరుకునే రోజు ఎంతో దూరం లేదన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట.


Tags:    

Similar News