పసిడి ప్రియులకు షాక్

దేశంలో బంగారం, వెండి ధరలు ఈరోజు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.250లు, కిలో వెండిపై రూ.140లు పెరిగింది.

Update: 2022-02-11 01:21 GMT

బంగారం అంటేేనే పెరుగుతుంది. దాని ధర తగ్గింది తక్కువ సార్లు అయితే పెరిగిందే ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి బంగారం, వెండి ధరల పెరుగుదల, తగ్గుదల ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, ఈనెల 20వ తేదీ తో పెళ్లిళ్ల సీజన్ ముగియనుంది. ఈ కారణంగా కూడా బంగారం ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం ధర తగ్గినా స్వల్పంగానే ఉంటుందని, ఎక్కువగా పెరిగేందుకే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

యాభై వేలకు చేరువలో.....
దేశంలో బంగారం, వెండి ధరలు ఈరోజు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.250లు, కిలో వెండిపై రూ.140లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,800 రూపాయలు ఉంది. పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49,970 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 66,800 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News