పసిడి ప్రియులకు భారీ షాక్... ఎంత పెరిగిందంటే?
బంగారం, వెండి ధరలు దేశంలో ఈరోజు పెరిగాయి. బంగారం తులంపై రూ.150లు పెరిగితే కిలో వెండి రూ.660 లకు పెరిగింది.
బంగారాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ధర స్థిరంగా, తగ్గినప్పుడే కొనుగోలు చేయాలి. లేకుంటే దాని ధరలు మనకు అందకుండా పెరిగిపోతాయి. మన అంచనాలను మించి ధరలు పెరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు ముందుగానే అంచనాలు వేశారు. వారి అంచనాలు నిజం చేస్తూ ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
పెరిగిన ధరలు.....
బంగారం, వెండి ధరలు దేశంలో ఈరోజు పెరిగాయి. బంగారం తులంపై రూ.150లు పెరిగితే కిలో వెండి రూ.660 లకు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,500 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,690 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కిలో హైదరాబాద్ మార్కెట్ లో 66,800 రూపాయలుగా ఉంది.