స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు కొంత తగ్గాయి. ఈ సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Update: 2021-12-28 02:01 GMT

బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో? ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. కొంచెం తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని భావిస్తారు వినియోగదారులు. బంగారాన్ని కేవలం అలంకారం కోసమే కాకుండా పెట్టుబడిగా చూసేవారు ఎక్కువ మంది ఉన్నారు. పసిడి అంటే మహిళలు ప్రాణమిచ్చినా, వారు కూడా దీనిని పెట్టుబడిగానే చూస్తారు. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు కొంత తగ్గాయి. ఈ సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,450 రూపాయలుండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,590 రూపాయలుగా ఉంది. బంగారం కొనుగోలు చేయాలంటే ఇది కరెక్ట్ టైమ్ అని, రానున్న కాలంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు సయితం చెబుతున్నారు.


Tags:    

Similar News