‌Haryana Elections : నేడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

నేడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమయింది.

Update: 2024-10-05 02:19 GMT

నేడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమయింది. సాయంత్రం ఆరు గంటల వరకూ జరగనుది. హర్యానా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 90 స్థానాలలకు ఒకే విడత హర్యానాలో పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరడంతో భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.

ఈ నెల 8న కౌంటింగ్...
సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారం చేశాయి. మ్యానిఫేస్టోను విడుదలను చేసి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. అయితే ఈసారి ఎవరికీ హర్యానా పీఠం దక్కునుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈ నెల 8వ తేదీన జరపనున్నారు. జమ్మూకాశ్మీర్ లో మూడు విడతల్లో ఎన్నికలు పూర్తవ్వగా, హర్యానాలో మాత్రం ఒకే విడతలో పోలింగ్ పూర్తికానుంది.


Tags:    

Similar News