స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధర

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి

Update: 2022-03-09 01:53 GMT

బంగారం ధరల పెరుగుదల ఆగుతుందంటే ఎవరూ నమ్మరు. దానికి కారణం దానికున్న డిమాండ్. ముఖ్యంగా భారత్ లో బంగారానికి అత్యధిక డిమాండ్. మహిళలు మక్కువ చూపే బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఇది అందరికి తెలిసిందే. అందుకే బంగారం ధరలు పెరిగాయంటే పెద్దగా షాక్ అవ్వరు. తమ వద్ద ఉన్న నగదును బట్టి బంగారాన్ని కొనుగోలు చేయడం మహిళలు అలవాటు చేసుకున్నారు. పెట్టుబడిగా కూడా చూస్తుండటంతో ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. అందుకే బంగారానికి భారత్ లో అంత డిమాండ్.

స్వల్పంగా తగ్గిన...
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,890 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధరలో స్వల్ప మార్పులు కన్పించాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 74,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News