మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
దేశంలో ఈరోజు బంగారం ధర తగ్గింది. పది గ్రాముల బంగారంపై 400 రూపాయలు తగ్గింది.
బంగారం అంటేనే మగువలకు మోజు. బంగారం ఉంటే ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఆశిస్తారు. అందుకే భారతీయ మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు. దీనివల్లనే భారత్ లో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. గతంలో పెళ్లిళ్ల సీజన్ లలోనే కొంత కొనుగోళ్లు ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పడు అలా కాదు కొనుగోళ్లకు ఒక సీజన్ అంటూ లేదు. ఎప్పుడు చేతిలో డబ్బులుంటే అప్పుడే కొనుగోలు చేస్తున్నారు. అందుకే కొనుగోళ్ల దారులతో జ్యుయలరీ షాపులు కిటకిట లాడిపోతున్నాయి.
వెండి మాత్రం....
దేశంలో ఈరోజు బంగారం ధర తగ్గింది. పది గ్రాముల బంగారంపై 400 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,300 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 72,500 రూపాయలుగా ఉంది.