వరసగా మూడోరోజూ తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు వరసగా మూడు రోజుల నుంచి తగ్గుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది.
హైదరాబాద్ : బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని భారతీయుల్లో అత్యధిక శాతం మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఏమాత్రం తగ్గినా వెంటనే కొనుగోలు చేేసేందుకు సిద్ధమయిపోతారు. బంగారం ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం అరుదుగా చూస్తుంటాం. అందుకే తగ్గినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయాలని ఎక్కువ మంది భావిస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు గుడ్ న్యూస్.
వెండి మాత్రం....
బంగారం ధరలు వరసగా మూడు రోజుల నుంచి తగ్గుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,340 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 50,560 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 69,000 రూపాయలుగా ఉంది.