పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. రెండు వందల రూపాయలు తగ్గింది.

Update: 2021-12-30 01:57 GMT

బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. బంగారం ధరలు గత కొద్ది రోజులుగా స్థిరంగా, మరికొద్దిరోజులు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం పెట్టుబడిగా భావించే అనేక మందికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ ఇలా బంగారం ధరలు తగ్గడం చూడలేదని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సాధారణమే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న సమయంలో ధరల తగ్గుదల కొనుగోలు దారులకు మంచి అవకాశంగా చెబుతున్నారు.

ధరలు తగ్గింది ఇలా....
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. రెండు వందల రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 45,150 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,260 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News