పసిడిప్రియులకు బంగారం లాంటి వార్త

బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గడంతో కొనుగోళ్లు పెరుగుతాయంటున్నారు వ్యాపారులు.

Update: 2022-01-02 02:15 GMT

బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గడంతో కొనుగోళ్లు పెరుగుతాయంటున్నారు వ్యాపారులు. బంగారం ధరలు రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల మేరకు బంగారం ధరలు పెరిగాయని చెప్పాు. కానీ ఈరోజు ఒక్కసారిగా బంగారం ధరలు తగ్గడం వినియోగదారులకు ముఖ్యంగా మహిళలకు ఊరట కల్గించే అంశంగానే చెప్పాలి.

హైదరాబాద్ లో....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,200 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,100 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి వారం రోజుల్లో ఆరు వందల రూపాయల వరకూ తగ్గింది. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం అంటున్నారు.


Tags:    

Similar News