పసిడి ప్రియులకు భారీ షాక్

ఈరోజు బంగారం ధరలు మరింతగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 51,000 రూపాయలకు చేరుకుంది

Update: 2022-02-14 01:33 GMT

బంగారం అంటేనే మక్కువ చూపేవారు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశంలో ధరల పెరుగుదల సహజం. ధరలను చూసి బంగారాన్ని కొనుగోలు చేయరిక్కడ. తమ వద్ద ఉన్న సొమ్ములతోనే బంగారాన్ని కొనుగోలు చేస్తారు. దాని ధర ఎక్కువగా ఉన్నా పెద్దగా వెనకాడరు. అందుకే భారత్ లో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరో వైపు పెళ్లిళ్లు జరుగుతుండటంతో కొనుగోళ్లు ఎక్కువై డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా బంగారం మార్కెట్ పై పడింది.

ఈరోజు ధరలు...
ఈరోజు బంగారం ధరలు మరింతగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 51,000 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,810 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర51,060 రూపాయలకు చేరుకుంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి.


Tags:    

Similar News