బ్యాడ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు

తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. స్వల్పంగా పెరిగినా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే వారికి అది భారమే అవుతుంది.

Update: 2022-06-07 02:22 GMT

బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో? ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల ప్రకారం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వినియోగదారులు ఊరట చెందినంత సేపు పట్టలేదు. బంగారం ధరల్లో పెరుగుదలకు అనేక కారణాలుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. డిమాండ్ ను బట్టే కాకుండా అనేక కారణాలతో ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు.

వెండి ధరలు కూడా....
తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. స్వల్పంగా పెరిగినా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే వారికి అది భారమే అవుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,200 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరల్లో కూడా స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 68,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News