భారీగా తగ్గిన బంగారం... బాగా పెరిగిన వెండి

దేశంలో ఈరోజు బంగారం ధరలు బాగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.510 లు తగ్గింది. వెండి కిలోకు రూ.1200ల వరకూ పెరిగింది

Update: 2022-02-15 01:15 GMT

బంగారం అంటేనే మగువలకు ప్రీతి. బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగరాన్ని కేవలంల ఆభరణాలుగా మాత్రమే చూడరు. పెట్టుబడిగా చూడటంతోనే బంగారానికి మన దేశంలో డిమాండ్ అధికం. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల ప్రకారం బంగారం ధరలలో మార్పులు, చేర్పులు ఉంటాయి. కొనుగోళ్లను బట్టి మాత్రమే కాకుండా మార్కెట్ ను బట్టి ధరల నిర్ణయం ఉంటుంది.

ధరలు ఇలా....
దేశంలో ఈరోజు బంగారం ధరలు బాగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.510 లు తగ్గింది. వెండి మాత్రం కిలోకు రూ.1200ల వరకూ పెరిగింది. హైదరాబాద్ లో బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంధర 50,510 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర రూ,800 ల నుంచి 1200 రూపాయలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర 68,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News