స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి ధరలు

ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు

Update: 2022-02-02 01:26 GMT

బంగారం అంటేనే అందరికీ క్రేజ్. విలువైన వస్తువుగా తొలి నుంచి భావించడమే ఇందుకు కారణం. బంగారం ఉంటే తమ పరువు ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయని, సమాజంలో గౌరవం లభిస్తందని భావించడమే బంగారం కొనుగోళ్లు పెరుగుతుండటానికి కారణం. ఎప్పుడైతే కొనుగోళ్లు పెరుగుతాయో ఆటోమేటిక్ ధరలు కూడా పెరుగుతుంటాయి. బంగారాన్ని ముఖ్యంగా మహిళలు కొనుగోలు చేస్తుండం.. సీజన్ లతో సంబంధం లేకుండా జ్యుయలరీ షాపులు కిటకిట లాడుతుండటమే బంగారానికి ఉన్న క్రేజ్ కారణమని మార్కెట్ నిపుణులు సయితం చెబుతుంటారు.

పెరిగిన వెండి ధరలు...
ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,900 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,960 రూపాయలుగా ఉంది. వెండి ధర పెరిగింది. వెండి కిలోకు రూ.700 ల వరకూ పెరిగింది. మార్కెట్ లో కిలో వెండి ధర 65,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News