స్థిరంగా బంగారం... స్వల్పంగా తగ్గిన వెండి

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. వెండి కిలోకు రూ.100 లు తగ్గింది

Update: 2022-02-12 01:22 GMT

బంగారానికి ఎప్పుడూ డిమాండే. దాని విలువ ఎప్పటికీ తగ్గదు. బంగారాన్ని కోరుకోకుండా ఉండే రోజు ఉండదు. ముఖ్యంగా భారతీయ మహిళలు ఎక్కువగా ఇష్పపడే బంగారానికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అందుకే వీధికొక్క జ్యుయలరీ షాపు మనకు కన్పిస్తుంది. ఎవరి స్థాయిలో వారు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ఆధారండా హెచ్చు, తగ్గులుంటాయి. బంగారమయినా, వెండి అయినా కొనుగోళ్లను బట్టి వాటి ధరలు మార్కెట్ లో మారుతుంటాయి.

వెండి ఈరోజు ధర....
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. వెండి కిలోకు రూ.100 లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 45,800 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,970 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 66,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News