బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే?

రెండు రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అంటే దీనికి అర్థం త్వరలో పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Update: 2021-12-21 01:33 GMT

రెండు రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అంటే దీనికి అర్థం త్వరలో పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ మేరకు ప్రస్తుతం బంగారం ధరలు నిలకడగా ఉన్నాయని, పెరిగే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. స్థిరంగా ఉన్నప్పుడు కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. బంగారం కొనుగోళ్లు మందగించడంతోనే ధరలు స్థిరంగా ఉన్నాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఈ రకంగా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,700 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,850 రూపాయలుగా ఉంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయమని చెబుతున్నారు.


Tags:    

Similar News