గుడ్ న్యూస్ ... బాగా తగ్గిన బంగారం ధర

దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై వెయ్యి రూపాయలు తగ్గింది.

Update: 2022-06-15 02:03 GMT

బంగారాన్ని భారతీయులు సంప్రదాయ వస్తువుగానే చూస్తారు. ముఖ్యంగా మహిళలు తమ ఇంట్లో శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడానికి శుభంగా భావిస్తారు. అందుకే పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. గత కొంత కాలంగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్వోల్బణం కూడా బంగారం ధరల్లో మార్పులకు కారణమని చెబుతారు మార్కెట్ నిపుణులు. గత మూడు రోజుల నుంచి పెరిగిన బంగారం ఈరోజు భారీగా తగ్గింది.

ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై వెయ్యి రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,700 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా తగ్గింది. వెండి కిలో పై రూ.660లు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 66,000 లుగా ఉంది.


Tags:    

Similar News