గుడ్ న్యూస్... యాభై వేలకు దిగువకు బంగారం

దేశంలో బంగారం ధరలు బాగా తగ్గాయి. బంగారం ధర స్వల్పంగా, వెండి ధర కొంత పెరిగింది

Update: 2022-02-18 01:13 GMT

బంగారాన్ని భారతీయులు సెంటిమెంట్ గా భావిస్తారు. మహిళలు తమ మెడలో బంగారం ఉంటే చాలు అదో రకమైన అనుభూతిని ఫీలవుతారు. బంగారం లేకుంటే బోసిగా కన్పిస్తామని చాలా మంది భావిస్తారు. అందుకే బంగారానికి భారత్ లో సెంటిమెంట్ తో పాటు మక్కువ ఎక్కువగా ఉండటంతోనే డిమాండ్ అధికంగా ఉంటుంది. మరోవైపు 90 శాతం మంది బంగారాన్ని పెట్టుబడిగా కూడా చూస్తారు. అందుకే బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అయినా ధరల గురించి ఆలోచించకుండా కొనుగోళ్ల వైపు చూడటం వల్లనే జ్యుయలరీ షాపులు కిటకిటలాడుతుంటాయి.

వెండి స్వల్పంగా....
దేశంలో బంగారం ధరలు బాగా తగ్గాయి. బంగారం ధర స్వల్పంగా, వెండి ధర కొంత పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,800 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,970 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 68,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News