పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో వెండి ధరలు భారీగా పెరిగాయి.

Update: 2022-02-20 01:02 GMT

బంగారం ధరల్లో అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులను అనుసరించి హెచ్చుతగ్గులుంటాయి. బంగారం డిమాండ్ ను బట్టి ధరలు ఎప్పుడూ ఉండవు. ఎందుకంటే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కాబట్టి. ఒక్కోసారి బంగారం ధరలు తగ్గి మహిళలను ఆకట్టుకుంటాయి. అదే సమయంలో భారీగా పెరిగిన సందర్భాలు లేకపోలేదు. అయినా బంగారానికి ఉన్న డిమాండ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు.

దేశంలో ధరలు...
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 46,000 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,190 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి 70 వేలు దాటింది. కిలో వెండి ప్రస్తుతం హైదరాబాద్ 70,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News