స్వల్పంగా పెరిగిన బంగారం... తగ్గిన వెండి

దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి కొంత తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2022-01-04 02:22 GMT

దేశంలో బంగారం, వెండికి ఎక్కడా లేని ఆదరణ ఉంది. అప్పు చేసైనా కాసు బంగారం కొనాలనుకుంటారు మహిళలు. బంగారం కొంటే జీవితంలో ఏదో సాధించినట్లు ఫీలవుతుంటారు. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్. ఇక పెళ్లిళ్ల సీజన్ అయితే చెప్పనవసరం లేదు. వచ్చేది పెళ్లిళ్ల సీజన్. బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో రానున్న కాలంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ నేటి ధరలు...
దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి కొంత తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,250 రూపాయలు ఉంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,360 రూపాయలుగా ఉంది. వెండి ధర కొంత తగ్గింది. ఈరోజు కిలో వెండి ధర 66,200 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News