పసిడి ప్రియులకు షాక్

దేశంలో ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర మాత్రం భారీగా తగ్గింది

Update: 2022-02-16 01:36 GMT

బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్ల పై ఆధారపడి ఉంటుంది. బంగారం ధర హెచ్చు, తగ్గులు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే బంగారం ధర స్థిరంగా ఉన్నప్పుడు కాని, తగ్గినప్పుడు కాని కొనుగోలు చేస్తే మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. బంగారానికి ఎప్పుడూ వన్నె తగ్గదు. అదే దాని విలువ కూడా ఎప్పుడూ పడిపోదు. పెట్టుబడిగా చూసి కొనుగోలు చేస్తే మంచిదని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి వాటి ధరల్లో మార్పులు, చేర్పులు ఉంటాయి.

భారీగా పెరిగిన వెండి ధర....
దేశంలో ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాములకు రూ.110 లు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,400 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 50,620 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధర కిలోపై రూ.800ల వరకూ పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 68,200 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News