Delhi : నేడు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం
ఢిల్లీలో నేడు ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరగనుంది.జమిలి ఎన్నికలపై చర్చించనున్నారు
ఢిల్లీలో నేడు ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీల నేతలు పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్డీఏ సమావేశం జరగనుంది. ప్రధానంగా జమిలి ఎన్నికలపై నేడు జరిగే సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే లోక్ సభలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ముందుగా మిత్రపక్షాలతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు మాట్లాడనున్నారు.
జమిలి ఎన్నికలకు...
జమిలి ఎన్నికల అవసరం గురించి వారికి తెలియజెప్పనున్నారు. 129వ రాజ్యాంగ సవరణపై చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. దీంతో పాటు తాజాగా జరుగుతున్న జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా కూటమి నేతలు చర్చించనున్నట్లు తెలిసింది. ఈసమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ