రెండో రోజు కువైట్ లో ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు కువైట్ లో రెండో రోజు పర్యటిస్తున్నారు

Update: 2024-12-22 02:58 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు కువైట్ లో రెండో రోజు పర్యటిస్తున్నారు. తొలి రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక సమావేశాల్లో బిజీగా గడిపారు. అధికారులతో రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. కువైట్ కు దాదాపు నలభై ఐదేళ్ల తర్వాత వెళ్లిన భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.

భారతీయ సంఘాలతో...
అయితే నిన్న భారతీయ సంఘాలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. మినీ ఇండియాలా కువైట్ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశంలో ఇంతమంది భారతీయులను చూడటం సంతోషంగా ఉందని చెప్పారు. కువైట్ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించే చెబుతుంటారని, విదేశీ కరెన్సీ ఆర్జనలో భారత్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. భారత్ - కువైట్ మధ్య దౌత్య సంబంధాలే కాదు.. విడదీయలేని మైత్రి కూడా ఉందని ఆయన పేర్కొన్నారు



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News